వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచిస్తూనే.. వెన్నంటి ఉన్న పార్టీ శ్రేణులను కాపాడుకుంటున్నారు. ఇప్పటికే అనేకులకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో, ప్రభుత్వంలో సముచిత గౌరవం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మహిళా ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఏమిటా సర్‌ప్రైజ్ అని అనుకుంటున్నారా..? ఇక సూటిగా ఆ విషయానికి వచ్చేద్దాం.. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి పూనుకున్నారు.
ఈ సందర్భంగా ఓ మహిళా ఎమ్మెల్యేకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు భర్తకు కీలకమైన పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ- పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ / సీఈవోగా రాయలసీమ ప్రాంతానికి చెందిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త అయిన ఆలూరు సాంబశివారెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి ఆమె భర్త సాంబశివారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి మరీ జగన్ కు కృతజ్ఞతలు తెలుపడం గమనార్హం. సెల్ఫీ దిగి జగన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆయన. తనకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని ఆయన అన్నారు.
జగన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపేందుకు తాను వచ్చానని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా యజ్ఞం చేస్తోందని.. దాన్ని తాను అందరి సహకారంతో పూర్తి చేస్తానని సాంబశివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సముచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.