వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గొల్లప్రోలులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోతాయని భయపెట్టారు.
ఇప్పుడు ఎక్కడైనా పంపిణీ ఆగిపోయిందా? . గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బంది సాయంతో పెన్షన్లు అందించాం. అవసరమైతే తనలాంటి ఎమ్మెల్యేలు వచ్చి పెన్షన్ ఇస్తారు’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటాను. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నాను. తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని తెలిపారు.