రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోంది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వకుండా తప్పించుకునేందుకు కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎంతో మంది లక్ష రూపాయల కోసం ఎదిరిచూస్తున్నారు.. బీసీ కులాలందరికి లక్ష రూపాయలు ఇవ్వాలి.. ఎన్నికల సమయంలో పథకాలు తెస్తున్నారు.. మేము కూడా ఈ టైంలోనే ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటె, ఎంపీ ఆర్ కృష్ణయ్య జోలికి వస్తే మూల్యం చెల్లించక తప్పదని, ఎన్నికల ముందు బీసీల ఆగ్రహానికి గురి కావొద్దని సియం కేసీఆర్ ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఆర్. కృష్ణయ్యను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసిల్ చౌరస్తాలో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు కేజీబీవీ, యుఆర్ఎస్ ఉద్యోగుల కనీస వేతనాలను చెల్లించాలని, ఒప్పంద ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా ఉద్యోగస్తుల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వెళ్లిన ఆర్. కృష్ణయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.