ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. రామాయపట్నం పోర్టులో దాదాపుగా సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇక, రామాయపట్నం పోర్టు మొత్తం నిర్మాణ వ్యయం అంచనా రూ. 3,736 కోట్లుగా ఉందన్నారు. తొలిదశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై కూడా దృష్టి సారించారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పనులు ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా సీఎంకు అధికారులు వివరించారు.10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష తొలి దశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తి కాగా, జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు.