నల్గొండ జిల్లాలో అల్లు అర్జున్ పర్యటన.. పోటెత్తిన జనం

-

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ పర్యటించారు. నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం భట్టుగూడెంలో తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం దగ్గర నిర్మించిన  కంచర్ల కన్వెన్షన్  ని ప్రారంభించారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే పెద్దవూర మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతోదాదాపు 1000 మందికి సరిపడే ఫంక్షన్ హాల్ నిర్మించారు. 

దాదాపు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు చంద్రశేఖర్ రెడ్డి. నాగార్జున సాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న అల్లు అర్జున్ మామ, స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అల్లు అర్జున్ రాకతో జనసందడి నెలకొంది. అల్లు అర్జున్ ను చూసేందుకు ప్రజలు ఎగపడ్డారు. పోలీసులు వారిని అదుపులో పెట్టారు. కన్వెన్షన్ హాల్లో అల్లు అర్జున్ కి సంబంధించిన భారీ కటౌట్స్ తో పాటు, బీఆర్ఎస్ జెండాలు, కేటీఆర్ కటౌట్స్ కనిపించాయి. అల్లు అర్జున్ చూడటానికి అతని అభిమానులు విపరీతంగా వచ్చారు. అల్లు అర్జున్ కుటుంబంతో సహా భట్టుగూడెం వచ్చినట్టు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news