ఎల్బీనగర్-ఉప్పల్‌లో భారీ ట్విస్ట్‌లు..!

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేలని సైడ్ చేసి..వేరే వాళ్ళకు సీట్లు ఇస్తారనే ప్రచారం ఉంది. మొదట ఉప్పల్ సీటు గురించి మాట్లాడుకుంటే ..2018 ఎన్నికల్లో ఇక్కడ బి‌ఆర్‌ఎస్ నుంచి భేతి సుభాష్ రెడ్డి గెలిచారు. అయితే ఇక్కడ సుభాష్ పై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది.

ఇదే సమయంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్..ఈ సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఈ సీటు కోసం పట్టు పట్టారు..కానీ సీటు దక్కలేదు. ఈ సారి మాత్రం వదులుకోకూడదనే పట్టుదలతో ఉన్నారు. లక్ష్మారెడ్డి సైతం రేసులోకి వచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్‌ని తప్పించడానికే బి‌ఆర్‌ఎస్ అధిష్టానం మొగ్గు చూపింది..కాకపోతే సీటు విషయంలో కన్ఫ్యూజన్ వచ్చింది.  ఉప్పల్ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి బెటరా? బొంతు రామ్మోహన్‌ బెటరా? అనే అంశంపై ఫ్లాష్‌ సర్వేను బీఆర్‌ఎస్‌ నమ్ముకుంది. దాదాపు బొంతు వైపే బి‌ఆర్‌ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

అటు ఎల్బీనగర్ విషయానికొస్తే..గత ఎన్నికల్లో ఇక్కడ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. బి‌ఆర్‌ఎస్ నుంచి ఎం రామ్మోహన్ గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కూడా ఈయన..బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఖచ్చితంగా తనకే సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ సైతం ఈ సీటు వదులుకోకూడదని చూస్తున్నారు.

దీంతో సీటు ఇచ్చే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. కానీ అధిష్టానం మళ్ళీ సుధీర్ వైపే మొగ్గు చూపిందని తెలిసింది. దీంతో రామ్మోహన్..ఎట్టి పరిస్తితుల్లోనూ సుధీర్‌ని ఓడిస్తామని, సీటు ఇస్తే సహకరించమని అంటున్నారు. ఇలా ఉప్పల్, ఎల్బీనగర్ సీట్లలో రచ్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news