దిశా సమావేశం పెట్టుకొని ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఎలా పెట్టుకుంటారు ? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

-

జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఉందని తెలిసి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రెండు రోజులుగా ముందు సమావేశం పెట్టుకొని మీటింగ్ కి డుమ్మా కొడతారా అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

కనీసం సమావేశంలో సమాధానం చెప్పేవారు కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఒప్పుకున్నా.. జీహెచ్ఎంసీ అధికారులు సహకరించడం లేదని రైల్వే అధికారులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీ సహకారం లేకపోవడం వల్లనే పనులు పెండింగ్ లో పడుతున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు తగిన సహకారం ఉండటం లేదనే ప్రాజెక్ట్స్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.  హైదరాబాద్ కలెక్టర్ కు జీహెచ్ఎంసీ, రైల్వే సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news