పాడేరు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి :  పురందేశ్వరి

-

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు వద్ద ఇవాళ ఘోర  రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. దాదాపు 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. బైకును తప్పించబోయి లోయలో పడింది బస్సు. ఈ ప్రమాదంపై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. 

పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన చాలా బాధకరమన్నారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలన్నారు. తీవ్రంగా గాయపడిన ప్రమాద బాధితులను విశాఖకి తరలించాలని సూచించారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారని.. వైద్యాధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన వద్ద పలు సహాయక చర్యలు చేపడుతున్నారు. చీకటి పడుతుండటంతో బస్సులోయలో పడటం..   బస్సులో ఇంకా ఎంత మంది ఉన్నారు. ఎంత మందికి మొత్తం గాయాలయ్యాయి. బస్సులో ఎవరైనా ఉన్నారా అని బస్సు వద్దకు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news