తెలంగాణలో బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు. దీంతో వారు అసమ్మతిగా ఉన్నారు. ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. స్టేషన్‌ఘన్‌పూర్, ఉప్పల్, వేములవాడ, ఖానాపూర్, బోథ్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మార్పు చేసినట్టు ప్రకటించారు కేసీఆర్.
కొత్తగా ఎమ్మెల్యే సీట్లను పొందిన వారు.. ఉప్పల్ – బండారు లక్ష్మా రెడ్డి, వేములవాడ – చల్మెడ లక్ష్మినరసింహారావు, ఖానాపూర్ – భూక్యా జాన్సన్ నాయక్, స్టేషన్ ఘన్ పూర్ – కడియం శ్రీహరి, ఆసిఫాబాద్ – కోవ లక్ష్మి, వైరా – మదన్ లాల్, బోథ్ – అనిల్ జాదవ్, కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్, దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ – కడియం శ్రీహరి, హుజురాబాద్ – కౌషిక్ రెడ్డి, ములుగు – నాగ జ్యోతి ఉన్నారు. వీరిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు కడియం, కౌశిక్ , జెడ్పీ చైర్మన్ నాగ జ్యోతికి ఈ సారి ఎమ్మెల్యే టికెట్ దక్కింది.