నా ప్రియమైన మెగాస్టార్‌కు హ్యాపీ బర్త్ డే : అల్లు అర్జున్

-

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ 68వ ఏట అడుగుపెట్టారు. అన్నయ్య బర్త్‌డే నేపథ్యంలో అభిమానులు సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే… మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ చెబుతున్నారు. ‘నా ఇన్స్పిరేషన్, పెద్ద మామ చిరంజీవికి హ్యాపీ బర్త్డే’ అని సాయి తేజ్, ‘నా ప్రియమైన మెగాస్టార్ కి హ్యాపీ బర్త్డే’ అని అల్లు అర్జున్ ట్విట్టర్ లో విషెస్ తెలిపారు.

డైరెక్టర్లు బాబీ, గోపీచంద్, మారుతి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, శ్రీ విష్ణు, తేజ తదితరులు, అభిమానులు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ పొందిన డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ నెక్స్ట్ సినిమాను తెరకెక్కించనున్నారు. MEGA157ను యూవీ క్రియేషన్స్ నిర్మించనుండగా… చిరు బర్త్డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘బోలా శంకర్’తో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్… కొత్త సినిమాతో ట్రోలర్స్ నోళ్లను మూయించాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news