కేసీఆర్ మైనార్టీలకు అన్యాయం చేశారు – ఎంపీ అరవింద్

-

నిజామాబాద్: మంగళవారం ముస్లిం, మైనారిటీ ఏరియాలో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 ఏళ్లలో మైనార్టీలకు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల వల్ల లాభం చేకూరలేదన్నారు. బిజెపి మాత్రమే మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 3.5 కోట్ల ఇండ్లు ప్రధాని అవాస్ యోజన కింద పంపిణీ చేశామన్నారు.

 

ఇందులో 70 శాతం ముస్లిం మహిళలకె ఇచ్చామన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం, అవినీతి వల్లే తెలంగాణలో నిర్మాణాలు చేపట్టలేదని ఆరోపించారు. కేసీఆర్ కావాలనే తెలంగాణలో అవాస్ యోజన అమలు చేయలేదన్నారు. కోవిడ్ సమయంలో ముస్లింలకు చికిత్సతో పాటు భీమా కల్పించామన్నారు. ఆయుష్మన్ భారత్ ఆమలు చేయకుండా కేసీఆర్ మైనార్టీలకు అన్యాయం చేసారన్నారు. మిగితా రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని వివరించారు.

మోడీ ఆలోచన విధానం వల్ల ముస్లింలు బిజెపికి ఓట్లు వేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కావాలనే ముస్లింలను కేంద్ర పథకాలకు దూరం చేస్తున్నారని మడ్డిపడ్డారు. దళితబందు 50 శాతం మందికి కూడా అందలేదన్నారు. మైనార్టీ బంధు మాటలకే పరిమితం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ మహిళలకు మేలు జరిగిందన్నారు అరవింద్. ప్రతిపక్షాలు కామన్ సివిల్ కోడ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. బిజెపి ముస్లింలకు వ్యతిరేఖం కాదని నిరూపించే అవకాశం

Read more RELATED
Recommended to you

Latest news