చంద్రయాన్-3 చైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వేయిబో , బిలిబిలితో పాటు ప్రముఖ ఇంటర్నెట్ ప్లాట్ఫాంలలో చంద్రయాన్-3 ప్రయోగం ట్రెండ్ అవుతోంది. ప్రయోగం ఎలా సక్సెస్ అయిందో తెలుసుకోవడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు. కాగా, చంద్రుడిపైకి చైనా ఉపగ్రహాన్ని పంపినప్పటికీ దక్షిణ ధ్రువాన్ని చేరుకోలేకపోయింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా ఇవాళ భారత్ చరిత్ర సృష్టించింది.
రష్యా పంపిన లూనా-25 విఫలం కావటంతో.. దక్షిణ ధ్రువం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. అమెరికా, చైనాలు కూడా దక్షిణ ధ్రువాన్ని లక్ష్యంగా చేసుకొని స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపడానికి సిద్ధమవుతున్నాయి. ఆయా దేశాల్లోని స్పేస్ ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు అత్యంత సవాల్, సంక్లిష్టతతో కూడిన ‘దక్షిణ ధ్రువం’పైకి స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపటానికి ప్రయత్నిస్తున్నాయి.
అయితే.. చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ బుధవారం ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్. సరిగ్గా సాయంత్రం గం.6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.