జాబిల్లి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో పంపిన చంద్రయాన్-3 విజయవంతమైంది. ఇదే ఉత్సాహంతో మరో కీలక ప్రయోగానికి
సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్ 1 ప్రయోగాన్ని మరో రెండు నెలల్లో ప్రయోగించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఆ తర్వాత శుక్రుడిపైకి కూడా ఇస్రో గురిపెట్టనుంది.
అయితే.. వెయ్యి మంది శాస్త్రవేత్తల కృషి వల్లే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని చీఫ్ సోమనాథ్ అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని.. నాలుగేళ్ల కృషి ఫలించిందని చెప్పారు. చంద్రయాన్-3 కంటే పెద్ద లక్ష్యాలు ముందున్నాయని.. రోదసిలోకి మనిషిని పంపించడమే మా తొలి లక్ష్యమని తెలిపారు. త్వరలోనే అంగారకుడు, శుక్రుడిపై ప్రయోగాలు చేపడుతామని పేర్కొన్నారు.