బీఆర్ఎస్ – బీజేపీ రెండూ ఒక్కటే: కోదండరాం

-

బిజెపి – బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోపిడీ రాజ్యం పోయి సామాజిక తెలంగాణ రావాలని అన్నారు. ఇక సీఎం కేసీఆర్ భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు. కామారెడ్డి, గజ్వేల్ ప్రజల కోరిక మేరకే తాను రెండు చెట్ల పోటీ చేస్తున్నానని కేసీఆర్ చెప్పడం అబద్ధం అన్నారు.

అదే నిజమైతే 119 నియోజకవర్గాల ప్రజలు అడిగితే 119 స్థానాలలో పోటీ చేస్తారా..? అని ప్రశ్నించారు. కెసిఆర్ పై ఉమ్మడి అభ్యర్థిని దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారని తెలిపారు. తాను ఎక్కడ పోటీ చేయాలో తమ పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు కోదండరాం. ఇక పొత్తుల విషయంలో కాంగ్రెస్ ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news