బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించడం లేదు : తమ్మినేని వీరభ్రదం 

-

హైదరాబాద్ లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు సహా పలువురు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీకి దగ్గర అవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించలేదన్నారు. కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. 

తొందరపడాల్సిన అవసరం లేదని.. పార్టీ నిర్ణయించిందని తమ్మినేని పేర్కొన్నారు. ధరల పెరుగుదల పై సెప్టెంబర్ 01 నుంచి 07 వరకు ప్రదర్శనలు, నిరసనలు చేపడుతామన్నారు. సాయుధ పోరాటం స్ఫూర్తితో సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు విప్లవ వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సాయుధ పోరాట వారసత్వం తమదేనని.. కొనసాగిస్తున్నామని వెల్లడించారు తమ్మినేని వీరభద్రం. అమిత్ షా, నరేంద్ర మోడీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆశలు అడియాశలు అయ్యాయని ఆరోపించారు. బీజేపీ మరింత పడిపోతుందన్నారు తమ్మినేని. బీజేపీ ఓ విష కూటమి అని.. నిర్దిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడు అన్ని రకాల చర్చలు చేస్తామని తెలియజేశారు. ఉమ్మడిగా ఏం చేయాలనేది ఆలోచన చేస్తామన్నారు తమ్మినేని వీరభద్రం. 

Read more RELATED
Recommended to you

Latest news