దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కేసీఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మ గౌరవం పెంచారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని, ఏ డిక్లరేషన్ చేసినా సొంత రాష్ట్రంలో చేస్తే నీతి నిజాయితీ ఉందన్నట్లు తెలుస్తుందని ఎద్దేవాచేశారు. ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఖర్గే మొదట డిక్లరేషన్ చేసి, ఇక్కడ తర్వాత డిక్లరేషన్ చేయాలని మంత్రి హరీశ్ దుయ్యబట్టారు.
సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్‌లో బీడీ టేకేదార్లకు నూతన పింఛను మంజూరు, దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాల పంపిణీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలోని కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండి వెయ్యి రూపాయల పింఛను మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసి ఇప్పటికీ బండి లేదు.. గుండు లేదని ఎద్దేవా చేశారు..