తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ టికెట్లను కూడా ప్రకటించేసింది. టికెట్లు ప్రకటించడంతో భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. టికెట్లు ప్రకటించడంలో జాప్యం చేయడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… ఓటర్ల ఆగ్రహానికి గురవుతోంది కాంగ్రెస్.
అయితే తాజాగా రైతు బంధు మరియు రైతు బీమా పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూమి యజమానులకు రైతుబంధు ఇవ్వమని తెలిపారు. కేవలం కౌలు రైతులకు మాత్రమే రైతుబంధు మరియు రైతు బీమా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ తెలిపారు. ఇక కృష్ణ తేజ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమి యజమానులు రైతు బంధు ఇవ్వం
కేవలం కౌలు రైతులకు మాత్రమే రైతు బంధు, రైతు బీమా ఇస్తాం – కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ pic.twitter.com/0Hh1FMSHhm
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2023