ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరోసారి హిస్టరీ క్రియేట్ చేశాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని ముద్దాడిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తాజాగా.. ఇప్పటి వరకు ఏ భారత అథ్లెట్కు సాధ్యం కాని ప్రపంచ ఛాంపియన్ హోదాను అందుకున్నాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో ఒకే ఒక్క త్రోతో ఫైనల్కు దూసుకెళ్లిన నీరజ్.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాడు. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయినా.. రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.
అయితే ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ… ఈ బంగారు పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు నీరజ్ చోప్రా తెలిపాడు. నీరజ్ ఎన్ని పోటీలు గెలిచినా.. రికార్డులు తిరగరాసినా.. ఓవైపు క్రీడాభిమానులకు.. మరోవైపు నీరజ్ చోప్రాకు ఒకే ఒక వెలితి ఉంది. అదేంటంటే.. 90 మీటర్ల లక్ష్యం చేరుకోవడం. ఇప్పటివరకు నీరజ్.. తన బల్లెంను 90 మీటర్ల దూరాన్ని విసరలేకపోయాడు. చాలా సార్లు దీనిపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. తాజాగా ప్రపంచ ఛాంపియన్ఫిప్ విజయం గురించి మాట్లాడుతూ.. త్వరలోనే కచ్చితంగా 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.