తిరుమల వేంకటేశ్వరుని సేవలో ప్రతి రోజు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలోని నలు మూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ కిటకిటలాడుతూ తిరుమల పుణ్యక్షేత్రం విలసిల్లుతూ ఉంది. కాగా తాజాగా ఈవో ధర్మారెడ్డి భక్తులకు ఒక ప్రకటనను విడుదల చేశారు. వచ్చే నెలలో అనగా సెప్టెంబర్ 18వ తేదీ నుండి సెప్టెంబర్ 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేయనున్నారు. ఒక విధంగా భక్తులకు ఇది నిరాశ కలిగించే వార్తే అయినప్పటికీ, ప్రతి సంవత్సరం ఈ తొమ్మిది రోజుల వరకు తప్పదు. ఇక ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఘాట్ రోడ్ వద్ద 24 గంటల పాటుగా బస్సులను నడపడానికి అవకాశాన్ని కల్పించనున్నారు. ఇక సీఎం జగన్ 18వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
కాగా ఇటీవల చిరుత పులి దాడిలో ఒక చిన్నారి మరణించడం వలన అన్ని జాగ్రత్తలను తీసుకుంటుండగా, అందరి కళ్ళు టీటీడీ కమిటీ పైనే ఉంది. మరి మరో ఆపద జరుగకుండా టీటీడీ చైర్మన్ బ్రహ్మోత్సవాలను జరిపింబిచాల్సి ఉంది.