జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి తన ఇంట్లో అనుమానాస్పద మృతి, ఆమె చెల్లెలు అదృశ్యమైన విషయం తెలిసిందే. 22 ఏళ్ల దీప్తి అనే యువతి హైదరాబాద్ లోని మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని తన నివాసంలో దీప్తి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె చెల్లెలు చందన మేడ్చల్ లో బీటెక్ చదువుతుంది. దీప్తి మృతి చెందిన తర్వాత చందన అదృశ్యం అయ్యింది.
అయితే ఇంట్లో 30 తులాల బంగారం, రెండు లక్షల నగదు మాయమైనట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ ఈ కేసులో దీప్తి చెల్లెలు చందనతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. చందన బాయ్ ఫ్రెండ్, అతని తల్లి, చెల్లితో పాటు మరొకరిని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. దీప్తిని చెల్లి చందన హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. చందన వేరొక వ్యక్తిని ప్రేమించడంతో దీప్తి ఆమె తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ కోపంతో దీప్తిని తానే హత్య చేశానని విచారణలో ఒప్పుకుంది చందన.