లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్‌.. హత్య చేసిన బాలుడు

-

లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్‌పై ఒక బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.  ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.  జామియా నగర్‌లోని బాటా హౌస్‌ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లోని ఒక ఇంటి నుంచి రక్తం వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఆ ఇంటి డోర్‌ బ్రేక్‌ చేసి లోపలికీ వెళ్లి చూశారు. ట్యూషన్‌ చెప్పే వ్యక్తి గొంతు కోసి అతడ్ని హత్య చేసినట్టు గ్రహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.

 పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. హత్యకు గురైన ట్యూటర్‌ స్వలింగ సంపర్కుడు. రెండు నెలల కిందట పరిచయమైన 14 ఏండ్ల బాలుడ్ని అతడు లైంగికంగా వేధించాడు. ఆ బాలుడితో పలుమార్లు స్వలింగ సంపర్కం చేశాడు. దీనిని వీడియో రికార్డ్‌ చేశాడు. తన మాట వినకపోతే వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. మరోవైపు ఆగస్ట్‌ 30న తన ఇంటికి రావాలని ఆ బాలుడ్ని ట్యూటర్‌ పిలిచాడు. అయితే లైంగిక వేధింపుల పట్ల ఆగ్రహంతో ఉన్న ఆ బాలుడు ఆ ట్యూటర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. మధ్యాహ్నం 2.15 గంటలకు ట్యూటర్‌ ఇంటికి చేరుకున్నాడు. వెంట తెచ్చిన పదునైన కత్తితో ఆ వ్యక్తి  గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Read more RELATED
Recommended to you

Latest news