శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా జరుగుతున్న ఆసియా కప్ లో గ్రూప్ ఏ నుండి ఇండియా మరియు పాకిస్తాన్ లు సూపర్ 4 కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్ బి లో భాగంగా ఇంకా ఏ ఒక్క జట్టు కూడా సూపర్ 4 కు అర్హత సాధించలేదు. బంగ్లాదేశ్ తాము ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయి రెండు పాయింట్ లతో రెండవ స్థానంలో ఉంది. ఇక శ్రీలంక ఒక మ్యాచ్ లో గెలిచి రెండు పాయింట్ లతో మొదటి స్థానంలో ఉంది. కానీ ఆఫ్గనిస్తాన్ మాత్రం ఆడిన ఒక మ్యాచ్ లో ఓటమి పాలయ్యి ఆఖరి స్థానంలో ఉంది. ఇక ఈ రోజు లాహోర్ లో ఆఫ్గనిస్తాన్ మరియు శ్రీలంక ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రోజు శ్రీలంక కు ఎక్కువగా సూపర్ 4 కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆఫ్గనిస్తాన్ ఈ మ్యాచ్ లో శ్రీలంక ను భారీ తేడాతో ఓడిస్తే మాత్రమే మూడు జట్లకు రెండు పాయింట్లు ఉంటాయి.
అప్పుడు ఎక్కువ రన్ రేట్ ఉన్న రెండు జట్లు సూపర్ 4 కు వెలుతాయి. మరి ఆఫ్గనిస్తాన్ ఈ రోజు సంచలన ప్రదర్శన చేసి వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ టైటిల్ కొడుతుందా చూడాలి.