SHOCKING NEWS: 3 రోజులు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గి, జొమాటో సర్వీసులు బంద్ !

-

ప్రస్తుతం ఆన్లైన్ లో సేవలపై ప్రజలు ఎంతగానో ఆధారపడి ఉన్నారు. ఒక్క రోజు ఆన్లైన్ సర్వీస్ సంస్థలు ఏమైనా బంద్ అయితే జనం అంతా అల్లాడిపోతారు. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గి మరియు జొమాటో లు మూడు రోజుల పాటు బంద్ కానున్నాయట. జీ20 సదస్సుకు ఈ సారి ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జీ20 సమావేశాలు సెప్టెంబర్ 9 మరియు 10వ తేదీలలో మన దేశ రాజధాని ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లోని భారత మండపం లో ఉన్న కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్సిబిషన్ సెంటర్ లో జరుపుతున్నారు. ఈ మీటింగ్ కు చాల ప్రాముఖ్యత ఉండడంతో పోలీస్ యంత్రంగం మరియు ట్రిఫిక్ పోలీస్ యంత్రంగం చాలా జాగ్రత్తలను తీసుకుంటోంది. అందులో భాగంగా ఢిల్లీ పోలీస్ ప్రత్యేకమైన ఆంక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా ఆన్లైన్ సర్వీస్ లు మరియు కమర్షియల్ సర్వీస్ ల పై ప్రభావం పడనుందని తెలుస్తోంది.

అలా మూడు రోజుల పాటు ఢిల్లీ లో ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన జొమాటో మరియు స్విగ్గి లకు బంద్ ప్రకటించారు. ఇది నిజంగా ఢిల్లీ ప్రజలకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లకు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news