చంద్రబాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తి : సజ్జల

-

చంద్రబాబు వ్యవహారం దొంగతనం చేసి దబాయించినట్టుగా ఉందని వైఎస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నట్టు తేల్చింది వైయస్సార్సీపీ కాదని ఐటీ శాఖ అని గుర్తుంచుకోవాలన్నారు. ఐటీ కి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు.. తనను రెండు మూడు రోజుల్లో అరెస్టు చేస్తారంటూ రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. దోపిడీ చేసి తాను నిజాయితీపరుడు అయినట్టు చిత్రీకరించేందుకు చంద్రబాబు యత్నం చేస్తున్నారు.

Sajjala
Sajjala

ఇప్పటికే ఇది కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్టు కూడా చేయాల్సింది కానీ ఇంతకాలం ఎందుకు చూస్తుందో ఊరుకుందో అర్థం కాలేదు. ముడుపులు అన్ని ఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో ఐటి శాఖ సబ్ వివరంగా నోటీసుల్లో పేర్కొంది తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు అన్నారు ఐటి ముడుపుల కేసులో దోషి అని తేలితే చంద్రబాబుకు శిక్ష తప్పదని బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు తుప్పు లాంటి వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల. తాను చట్టానికి అతీతుడు అయినట్టు చంద్రబాబు మాట్లాడడం బర్తడే కింగ్ కాక మరేంటి అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news