లోకేష్ బాబు ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే వైసీపీ వాళ్ళు దాడులు చేసి టీడీపీ వారి మీదే మీద కేసులు పెడుతున్నారన్నారు నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ మంత్రి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెర్రరిజం సృష్టిస్తున్నారన్నారు. లోకేష్ పై అభిమానంతో వాలంటీర్లు పాదయాత్రలో తోడుగా ఉంటే వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలు తట్టుకోలేక వేల మంది రైతులు గ్రామాలు వదిలి పారిపోతున్నారు..
ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు.. దుర్మార్గాలకు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు.. జగన్ పతనం మొదలైంది. తొందరలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారు.. తన పై సీబీఐ పెట్టిన రూ.43 వేల కోట్ల కేసు గురించి మాట్లాడని జగన్ చంద్రబాబు చేయని అక్రమాల గురించి ప్రసంగాలు చేస్తారు. పుంగనూరు…అంగళ్ళు ఘటనల్లో అమాయకుల పై కేసులు పెట్టారు. అయినా ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.