ENG VS NZ : న్యూజిలాండ్ ముందు ఛాలెంజింగ్ టోటల్ ఉంచిన ఇంగ్లాండ్ … !

-

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో న్యూజిలాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ముగిసిన 4 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో రెండు జట్లు 2 – 2 తో సమంగా నిలిచాయి. ఈ ఫలితం కారణంగా వన్ డే సిరీస్ ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది. అందులో భాగంగా ఈ రోజు జరుగుతున్న మొదటి వన్ డే లో అయినా మొదట టాస్ గెలిచిన ఆతిధ్య న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బదులుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో మొత్తం నాలుగు ఆటగాళ్లు అర్ద సెంచరీ లు పూర్తి చేసుకున్నారు. డేవిడ్ మలన్ 54, బట్లర్ 72, స్టోక్స్ 52 మరియు లివింగ్ స్టన్ 52 లు అర్ద సెంచరీ లతో రాణించి జట్టుకు ఆ మాత్రం స్కోర్ ను సాధించి పెట్టారు.

న్యూజిలాండ్ ముందున్న పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదా తెలియాలంటే మరికొంత సేపు ఆగాల్సిందే. ఇక ఇంగ్లాండ్ లాంటి బలమైన బౌలింగ్ లైన్ అప్ ను తట్టుకుని ఈ మ్యాచ్ లో గెలవడం కత్తిమీద సాము లాంటిది అని చెప్పాలి. అయితే ఓపెనర్లు స్టడీ గా ఆడితే ఈ స్కోర్ ను ఛేదించడం ఏమంత కష్టం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news