ఇండియాపై 5 వికెట్లతో యువ స్పిన్నర్ సంచలనం… !

-

ఇండియా మరియు శ్రీలంక ల మధ్య ఆసియా కప్ సూపర్ 4 లో జరుగుతున్న మ్యాచ్ లో ఆతిధ్య శ్రీలంక అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా శ్రీలంక ముందు ఛాలెంజింగ్ టోటల్ ఉంచడంలో ఫెయిల్ అయింది. నిన్న మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారీ స్కోర్ చేసినా, ఈ రోజు మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ మినహాయించి మిగిలిన బ్యాట్స్మన్ అందరూ సమిష్టిగా విఫలం కావడంతో ఒక మోస్తరు స్కోర్ కే పరిమితం అయింది. ఒక దశలో ఇండియా భర్తీ స్కోర్ చేసేలా కనిపించినా అనంతరం శ్రీలంక యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలగే సీన్ లో ఎంటర్ అయ్యాక వరుసగా వికెట్లు తీసి ఇండియాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఇతను ఓవర్లు వేసి కీలకమైన గిల్ 19, రోహిత్ శర్మ 53, కోహ్లీ 3, రాహుల్ 39 మరియు పాండ్య 5 లను అవుట్ చేశాడు. ఇండియాపై అయిదు వికెట్లు అదీ స్పిన్నర్ పడగొట్టడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఇతను మొత్తం 10 ఓవర్లలో ఒక మేడిన్ వేసి 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం ఇండియా పరుగుల వద్ద ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. ఇంకో మూడు ఓవర్లు జరగాల్సి ఉండగా క్రీజులో అక్షర్ పటేల్ మరియు సిరాజ్ లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news