కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధాలకు అరెస్ట్‌ వారెంట్

-

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం కేసుకు సంబంధించి వీరికి కోర్టు వీరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2015లో ప్రత్యేక హోదాను కోరుతూ విజయవాడ బస్టాండ్ వద్ద వైసీపీ నేతలు ధర్నా చేశారు.

ఈ నిరసనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధా విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. కాగా, కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు నాయకులు ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే కారణంగా కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాక పోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news