06-11-2019: మ‌రో సారి క్షీణించిన బంగారం.. ఇదే బాట‌లో వెండి..!

-

ప‌సిడి ప్రేమికుల‌కు శుభ‌వార్త‌. బంగారం ధ‌ర మ‌రో సారి క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.40,300కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.36,940కు క్షీణించింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. రూ.50 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,700కు దిగొచ్చింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.38,950కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.37,750కు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.48,700కు దిగొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news