విటమిన్ టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్‌ను మింగేసిన మహిళ

-

పొరపాటున ఒక టాబ్లెట్ బదులు మరో టాబ్లెట్ వేసుకున్న వారి గురించి విని ఉంటాం. యాపిల్ ఎయిర్‌పాడ్‌ను విటమిన్ టాబ్లెట్ అనుకుని మింగేసింది ఓ మహిళ. వివరాల్లోకి వెళ్లితే.. ఉటాకు చెందిన ఓ మహిళ యాపిల్ ఎయిర్‌పాడ్‌ను విటమిన్ టాబ్లెట్ అనుకుని పొరపాటున మింగేసిందట. ఆ తరువాత తను చేసిన తప్పు తెలుసుకుందట. తన్నా బార్కర్ అనే 52 సంవత్సరాల మహిళ తన స్నేహితుడితో మాట్లాడుతూ వాక్ చేస్తోందట. అదే సమయంలో విటమిన్ టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చి తన దగ్గర ఉన్న వాటర్‌తో ఎయిర్‌పాడ్‌ను మింగేసిందట. తరువాత చూస్తే చేతిలో మాత్రలు ఉన్నాయి. దాంతో ఎయిర్‌పాడ్‌ను మింగేసానని ఆమెకు అర్ధమైంది. వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టింది.

బార్కర్‌ను పరీక్షించిన వైద్యులు ఎయిర్‌పాడ్‌ సహజంగానే బయటకు రావాలని సజెస్ట్ చేసారట. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉందో లేదో తెలియదు కానీ తను మాత్రం ఇలా చేసానని.. ఏం జరుగుతుందో చూడాలని.. ప్రస్తుతం వైద్యుల సలహాను పాటిస్తున్నానని బార్కర్ చెబుతోంది. పరధ్యానంలో ఉంటే ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటామో ఈ కథనం చెబుతోంది. ప్రస్తుతం బార్కర్ ఎయిర్‌పాడ్‌ మింగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news