ENG VS NZ : ఇంగ్లాండ్ ను వణికిస్తున్న ట్రెంట్ బౌల్ట్… !

-

ప్రస్తుతం న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. నాలుగు టీ 20 లు మరియు నాలుగు వన్ డే లు ఆడాల్సిన ఉండగా, ఇప్పటికే టీ సిరీస్ ను న్యూజిలాండ్ డ్రా చేసుకుంది. ఇక వన్ డే సిరీస్ మాత్రం ఇప్పటికి ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు చెరొక మ్యాచ్ గెలుచుకుని సిరీస్ ను సమంగా ఉంచారు.. దీనితో ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లు రెండు జట్లు ఖచ్చితంగా గెలుచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఈ రోజు మూడవ వన్ డే లో భాగంగా న్యూజిలాండ్ కెప్టెన్ టీం టీం సౌథీ టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ను ట్రెంట్ బౌల్డ్ బెంబేలెత్తించాడు, కొత్త బంతితో బౌలింగ్ స్టార్ట్ చేసిన బౌల్డ్ మొదటి బంతికే భయంకర బ్యాట్స్మన్ బెయిర్ స్టో ను ఎల్బీడబ్ల్యు గా అవుట్ చేశాడు.. అనంతరం తన మూడవ ఓవర్ లో మళ్ళీ జో రూట్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ కు భారీ షాక్ ఇచ్చాడు.

ఇదే విధంగా గత మ్యాచ్ లోనూ వరుసగా మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్ గత మ్యాచ్ లాగే తేరుకుని భారీ స్కోర్ సాధిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news