రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు వాడి వేడిగా ఉన్నాయి. టిడిపి నాయకత్వాన్ని ఎవరు భుజాన వేసుకుంటారో, నిరాశలో ఉన్న శ్రేణులలో ఉత్సాహం ఎవరు నింపుతారో అని ప్రతి టిడిపి కార్యకర్త ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థానాన్ని లోకేష్ భర్తీ చేస్తారా లేదా లోకేష్ ని కూడా అరెస్టు చేస్తారా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అదే జరిగితే టిడిపి నీ భువనేశ్వరి, బ్రాహ్మణి ముందుకు నడిపిస్తారా అని ప్రజలలో విస్తృతంగా ప్రచారం నడుస్తోంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పార్టీని, ఆశయాలను ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల భుజాన వేసుకున్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రచారం చేశారు. వైసిపి కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. నిర్దోషిగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని కార్యకర్తలలో నింపారు. షర్మిల.. జగన్మోహన్ రెడ్డి తరపున రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజలకు వైసీపీని చేరువ చేశారు.
అప్పుడు వైసీపీకి ఉన్న పరిస్థితి ఇప్పుడు టిడిపికి వచ్చింది. మరి ఆ ఇంటి ఆడవాళ్ళలాగా లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి పార్టీ బాధ్యతను భుజాన వేసుకుంటారా అని అందరూ అనుకుంటున్నారు. అలాగే పార్టీలో భువనేశ్వరికి కీలక పదవి ఇస్తారని టాక్ వస్తుంది. కానీ అవేం జరిగేలా లేవు.
విజయమ్మ, షర్మిల పెరిగిన వాతావరణం వేరు భువనేశ్వరి, బ్రాహ్మణి పెరిగిన వాతావరణం వేరు. విదేశాలలో చదివిన బ్రాహ్మణి కి రాజకీయాలపై పట్టులేదు, భువనేశ్వరికి వ్యాపారం ఇల్లు తప్ప మరొకటి తెలియదు. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం రాగలరే తప్ప, పూర్తిగా పార్టీ బాధ్యతను భుజాన వేసుకొని కార్యకర్తలకు అండగా నిలబడలేరని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎలాగో లోకేష్-బాలయ్య పార్టీ బాధ్యతలని భుజాన వేసుకున్నారు. అటు పవన్ మద్ధతు ఉంది. వీరంతా కలిసి ఇప్పుడు పోరాటం మొదలుపెట్టనున్నారు. కాబట్టి అత్తా-కోడలు రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు.