కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి..? తుంగతుర్తిలో మూడుముక్కలాట.!

-

తుంగతుర్తిలో మోత్కుపల్లి నరసింహులు మళ్లీ పోటీ చేసి తన ప్రాభవాన్ని చాటుకోవాలని చూస్తున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నారా? అంటే తాజా మోత్కుపల్లి కాంగ్రెస్ లో చేరాలని ఆలోచనతో స్థానిక హస్తం నేతలతో, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కూడా సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి.  మోత్కుపల్లి టీడీపీలో మొదట నుంచి పనిచేశారు. దశాబ్దాల పాటు పార్టీలో ఉన్నారు.

ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా పొందారు. తర్వాత మోత్కుపల్లి 2009లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి వెంకటేశ్వరరావు సహకారంతో పదివేల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలై కొన్నాళ్లకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నెక్స్ట్ బి‌జే‌పిలోకి వెళ్లారు. తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. అక్కడ ప్రాధాన్యత లేకపోవడంతో కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నట్లు తెలిసింది.

 

మళ్ళీ తుంగతుర్తిలో తన గత వైభవాన్ని సాధించాలి అనుకుంటున్నారు. గతంలో మోత్కుపల్లిని ఆదరించిన తుంగతుర్తి ప్రజలు ఈసారి కూడా ఆదరిస్తారా లేదా ??అనే ప్రశ్న అందరి ముందు ఉంది. 2009 ఎన్నికలలో స్థానికేతరుడైన మోత్కుపల్లిని గెలిపించిన తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు ఈసారి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

స్థానిక, స్థానికేతరుడు అనే భేద భావాలు నియోజకవర్గ ప్రజలలో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ నుంచి మందుల సామేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇటు గత రెండు ఎన్నికల్లో గెలుపు వరకు పొరాడి తక్కువ మెజారిటీలతో ఓడిపోయిన అద్దంకి దయాకర్ ఉన్నారు. ఇప్పుడు మోత్కుపల్లి వస్తానని అంటున్నారు. దీంతో తుంగతుర్తి కాంగ్రెస్ లో మూడు ముక్కలాట జరిగేలా ఉంది.

ఇప్పటికే తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ మరి ఈసారి టికెట్ వస్తుందో లేదో అని ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అదిస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికల వరకు వేచి చూస్తే తప్ప తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news