తెలంగాణ నెంబర్‌ రాష్ట్రంగా ఎదిగింది : కొప్పుల ఈశ్వర్‌

-

రామగుండం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ నెంబర్‌ రాష్ట్రంగా ఎదిగిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే కోరుకుంటి చందర్‌ను మరోసారి భారీ మెజారిటీతో గులాబీ సైనికులు గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు.

Koppula Eshwar says to Improve facilities at VM Home | INDToday

ఉద్యమ సమయంలో రామగుండం కేసీఆర్‌కు అండగా నిలిచిందని, ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఉందన్నారు మంత్రి కొప్పుల. మరోసారి చందర్‌కు భారీ మెజారిటీని అందించాలన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో రాష్ట్రం బ్రహ్మాండమైన ప్రగతిని సాధించిందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. 60ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు చేసింది ఏమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు.

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పదివేల ఉద్యోగాలు ఇస్తే.. సీఎం కేసీఆర్ తొమ్మిది ఏళ్ల పాలలో 2.22లక్షల ఉద్యోగాలను సృష్టించారన్నారు. ఐటీలో రూ.4లక్షలకోట్లకుపైగా పెట్టుబడులు హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. ఐటీ అంటేనే హైదరాబాద్‌ అనీ, వ్యవసాయానికే కేరాఫ్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ సైనికులు పార్టీ అభ్యర్థి చందర్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news