హైదరాబాద్ వేదికగా ఇవాళ నుంచి రెండు రోజుల పాటు సీడబ్ల్యుసీ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల కోసం ఏఐసిసి అధికార ప్రతినిధి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ పవన్ ఖేరా కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఉద్దేశిస్తూ…‘కవితను ఈడీ విచారణకు ఎందుకు పిలిచింది?’ అని ప్రశ్నించారు. కేంద్రంతో కాంగ్రెస్ ఎలా పోరాడుతుందో కవితకు తెలియదా? అని ప్రశ్నించారు. ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదాం అని పిలిచారు. అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు అని చెబుతూ.. నేటినుంచి జరగనున్న సమావేశాల నిర్ణయాలను సాయంత్రం వివరిస్తామని చెప్పుకొచ్చారు.