మాట్లాడితే బటన్ నొక్కాను… బటన్ నొక్కాను అంటారు… మీరు బటన్ నొక్కడం వల్ల ఏ ఒక్కరైనా బాగుపడ్డారా? అని జగన్ మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాములో కొన్ని లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణను ఇవ్వడం వల్ల 80 వేల మందికి అప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.
విద్యావంతులైన యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని కీర్తించాల్సింది పోయి, జైల్లో పెట్టి… సినిమాలు రెండవ వారం, మూడవ వారం ఆడింది అని ప్రకటించుకున్నట్లుగా ఆరవ రోజు, ఏడవ రోజు అని సాక్షి దినపత్రికలో రాయడం నీచమైన పని అంటూ రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కు తేడా తెలియని దద్దమ్మలు ఈ కేసును విచారిస్తూ మొండిగా వాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కీం అమల్లో ఎటువంటి అవినీతి జరగలేదని, ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగతంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.