వామ్మో.. డేంజరస్ నాగుపాములను ఏం చేస్తున్నాడో చూడండి…!

-

పాము అంటేనే దడుసుకుంటాం. ఇంకా నాగు పాము అంటే ఇక అంతే. లాగు తడిసిపోవాల్సిందే. ఒక పామును చూస్తేనే మనకు అలా ఉంటే.. వందల నాగుపాముల మధ్య ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే గుండె ఆగిపోవడం ఖాయం.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి చాలా సంఖ్యలో నాగుపాములు ఉన్న పాముల పిట్ లోకి వెళ్లి ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తున్నాడు. వాటి విసర్జనను క్లీన్ చేస్తూ ఇలా పాములను ఓ వైపుకు విసురుతున్నాడు. అతడు వాటిని పట్టుకోబోతుండగానే అవి పడగ విప్పినా మనోడు మాత్రం ఏమాత్రం భయం లేకుండా.. ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వాటిని విసిరేస్తుండటం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒకవేళ వాటిలో ఏదైనా మనోడికి కరిస్తే ఎలా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news