చిన‌బాబు చేతిలో అవినాష్‌కు అవ‌మానం..!

-

తెలుగుదేశం పార్టీలో యువనేతల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియని పార్టీలో తమ భవిష్యత్తుని ఏ విధంగా చూసుకోవాలో బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబాలకు చెందిన యువనేతలకు కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తుకి ఏ ఇబ్బంది లేదని భావించిన వాళ్ళు ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నారు. వారిలో ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముందు వరుసలో ఉంటారు.

చంద్రబాబు చెప్పారని కాదనలేక గుడివాడ నుంచి పోటీ చేసిన అవినాష్ ఆ తర్వాత నానా అవస్థలు పడ్డారు. అక్కడి నాయకుల వ్యవహారశైలి ఆధిపత్య పోరు దెబ్బకు అవినాష్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. అక్క‌డ అవినాష్ దాదాపు రు.80 కోట్ల వ‌ర‌కు చేతి చ‌మురు వ‌దిలించుకున్న‌ట్టు టాక్‌.
ఇక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన అవినాష్ ఆ తర్వాత కూడా ఉత్సాహంగానే కనిపించారు.

అయితే లోకేష్ దెబ్బకు ఆయనకు చుక్కలు కనపడుతున్నాయి. ఏ కార్యక్రమానికి వెళ్ళాలి అన్నా సరే లోకేష్ ని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నారు. చివరకు ఇటీవల కంకిపాడులో పుస్తకాలు పంపించే కార్యక్రమానికి కూడా ఆయన వెళ్ళగా పెనమలూరులో వేలు పెట్టవద్దని సూచించారట. దీనితో అవినాష్ వెళ్ళడం మానేశారు. ఇకపోతే… అవినాష్ ముందు పార్టీ మారాలని చూసినప్పుడు… పెనమలూరు సీటు ఇస్తామని చెప్పారట.

అక్కడి నిదానంగా పని చేసుకోమని చంద్రబాబు చెప్పిన వెంటనే రంగంలోకి దిగిన చినబాబు,.. తాను పెనమలూరు నుంచి పోటి చేస్తాను వచ్చే ఎన్నికల్లో అనే సంకేతాలను అవినాష్ కి పంపించార‌ట‌. దీంతో అవినాష్ త‌న‌కు తీవ్ర అవ‌మానం జ‌రిగిన‌ట్టు స‌న్నిహితుల వ‌ద్ద వాపోయార‌ట‌. ఇప్పుడు మళ్ళీ అవినాష్‌ని గన్నవరం నుంచి పోటీ చేయమని కొందరు సూచిస్తున్నార‌ట‌. ఏదేమైనా దేవినేని నెహ్రూ లేక‌పోవ‌డంతో ఇప్పుడు టీడీపీ వాళ్లు అవినాష్ భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేశారనే చ‌ర్చ‌లే జిల్లాలో ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news