ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో తీపికబురు చెప్పనుంది. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం తీసుకువస్తోంది. సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా 49 అంశాల పై చర్చించనున్న ఏపీ కేబినెట్…. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది.
ఇవాళ ఈ పథకానికి ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరనుంది. UPSC లో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం చేనుంది.
అలాగే.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్ష పై చర్చించనుంది ఏపీ కేబినెట్. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన పై చర్చ నిర్వహించనుంది ఏపీ కేబినెట్. ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణంకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్.