మీకు ఇమేజ్ ఫార్మాట్లో స్పామ్ ఈ మెయిల్స్ వస్తున్నాయా? అయితే ఇవి నిరోధించేందుకు అద్భుతమైన పరిష్కారం. సాధారణంగా స్పామర్లు స్పామ్ బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు చిక్కకుండా ఉండేందుకు టెక్ట్స్‌ను ఫోటోల రూపంలో మెయిల్ చేస్తున్నారు. దీన్ని కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ సులభంగా రీడ్ చేయలేవు.
సాధారణంగానే మన ఈమెయిల్‌కు అనవసరమైన స్పామ్ మెయిల్స్ ఎన్నో వస్తుంటాయి. వీటిని నిరోధించేందుకు కంపెనీలు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. స్పామ్ బ్లాకింగ్ సాఫ్ట్వేర్ సాయంతో మెయిళ్లలోని సమాచారాన్ని రీడ్ చేసి, దాని ఆధారంగా అవి స్పామ్ కిందకు వస్తాయో లేదో గుర్తించవచ్చు.అయితే, ఇమేజ్‌ల రూపంలో ఉండే టెక్ట్స్‌ను ఏ సంకేతికత అడ్డుకోలేదు. ఫలితంగా ఇలాంటి స్పామ్ మెయిళ్లను నిరోధించడం కంపెనీలకు సాధ్యం కాలేదు.

ఈ టెక్నాలజీపై ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐఐటీ– హెచ్) పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. స్కాన్ చేసిన డాక్యుమెంట్, స్ట్రీట్ మార్క్‌ల ఇమేజ్ రూపంలో ఉన్న సమాచారాన్ని రీడ్ చేసి గుర్తించగలిగే వ్యవస్థపై సంస్థ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
బార్సిలోనాకు చెందిన కంప్యూటర్ విజన్ సెంటర్ (సీవీసీ), సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీవీఐటీ), ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనంలో పాల్గొంటున్నారు. డాక్యుమెంట్ ఇమేజ్ను సులభంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పామ్ బ్లాకింగ్ టెక్నాలజీపై వారు ప్రయోగాలు చేస్తున్నారు.
స్పామర్లు టెక్ట్స్‌ను ఫోటోల రూపంలో మెయిల్ చేసున్న ఇమేజ్‌లను కంప్యూటర్ల సాఫ్ట్వేర్లు సులభంగా గుర్తించే టెక్నాలజీ ఇప్పటి వరక అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు దీనిపై తాము పనిచేస్తున్నామని ప్రతినిధి జవహర్ చెప్పారు. కేవలం ఇమేజ్‌లలో ఉండే టెక్ట్స్‌ను రీడ్ చేయడమే కాకుండా దాన్ని సమగ్రంగా విశ్లేషించేందుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఈ పరిశోధనకు ‘డాక్యుమెంట్ విజువల్ క్వశ్చన్ ఆన్సర్నింగ్’ అని పేరు పెట్టారు. మనుషుల రిక్వెస్ట్‌లను అర్థం చేసుకోవడంతో పాటు, వాటికి తగిన విధంగా కంప్యూటర్లు స్పందించేలా ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు.
