టీడీపీ-జనసేన పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

-

టీడీపీ, జనసేన పొత్తుపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి పొత్తులపై స్పందించారు. పొత్తులపై సమయాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. టీడీపీతో పొత్తుపై తమ పార్టీ అధిష్ఠానానికి వివరిస్తానని పవన్ చెప్పారన్నారు. పవన్ వివరణను బట్టి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నానని చెప్పారని తెలిపారు.

Chhattisgarh: D Purandeswari's 'spit' remark sparks controversy | Raipur  News - Times of India

టీడీపీతో పొత్తుపై జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ చర్చించిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటుపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అంశంలో టీడీపీ పిలుపునిచ్చిన రిలే నిరాహార దీక్షల్లో సైతం జన సైనికులు పాల్గొంటున్నారు. అయితే ఈ పొత్తు గురించి వైసీపీ మొదటి నుండి అలర్ట్ గానే ఉంది

 

 

Read more RELATED
Recommended to you

Latest news