ఫోన్లో డేటా త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్‌ పాటించండి..!!

-

ఇంట్లో వైఫై ఉంటే.. ఎంత సేపు ఫోన్‌ వాడుతున్నాం, ఎంత డేటా అయిపోతుందనేది లెక్కనే ఉండదు. కానీ ఫోన్‌ డేటా అయితే.. వెంటనే అయిపోతుంది. ఇన్‌స్టాలో కాసేపు రీల్స్‌ చూస్తే చాలు.. 50% డేటా అయిపోయిందని మెసేజ్‌ వస్తుంది. కొన్నిసార్లు మనం ఏం వాడకునన్నా.. కూడా నెట్‌ త్వరగా అయిపోతుంది. అప్పుడు మనకు భలే కోపం వస్తుంది కదా..? ఈ సమస్య అందరికీ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 

మీ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి డేటా వినియోగాన్ని తరచుగా గమనించాలి. అవసరాలకు అనుగుణంగా డేటాను ఉపయోగించుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ను తక్కువగా వినియోగించినా, డేటా త్వరగా అయిపోతే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. సమస్యను పరిష్కరించాలని కోరాలి.

ఇంటర్నెట్ నుంచి ఫైల్స్, సినిమాలను డౌన్‌లోడ్ చేయడం వలన పెద్ద మొత్తంలో డేటా అయిపోతుంది. కచ్చితంగా అవసరం అయితే తప్ప, డౌన్ లోడ్ చేయడం మానుకోండి. అవకాశం ఉంటే వైఫై ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.

మీరు జర్నీలో ఉన్నప్పుడు Netflix, HBO Max వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మ్యూజిక్, వీడియో కంటెంట్‌ చూడాలి అనుకుంటే, Wi-Fiకి కనెక్ట్ అయినప్పుడు వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. నేరుగా వీడియోలను చూడటం ద్వారా డేటా పూర్తిగా అయిపోతుంది.

హై క్వాలిటీ స్ట్రీమింగ్ ద్వారా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎక్కువ డేటా అయిపోతుంది. అందుకే వీడియోలు చూసే సమయంలో క్వాలిటీ కాస్త తగ్గించుకుంటే డేటాను కాపాడుకోవచ్చు.

WhatsApp సహా మెసేజింగ్ యాప్స్‌లో సాధారణంగా ఫోటోలు, వీడియోలు, డియో ఫైల్స్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్ కోసం డిఫాల్ట్ సెట్టింగ్‌లను కలిగి ఉంటాయి. మీరు Wi-Fiలో లేకుంటే మీ మొబైల్ డేటాను పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. అందుకే డౌన్‌లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చుకోవాలి. అవసరం అయితేనే, డౌన్ లోడ్ చేసుకోవాలి.

తరచుగా యాప్ అప్‌డేట్స్ నోటిఫికేషన్లు వస్తాయి. వీటిని అప్ డేట్ చేయడం వల్ల ఎక్కువ డేటా అయిపోతుంది. వైఫై ఉన్న సమయంలోనే యాప్స్‌ను అప్ డేట్ చేసుకోవడం మంచిది. అందుకే ఆటోమేటిక్ యాప్స్ అప్ డేట్ ఆప్షన్‌ను డిజేబుల్ చేయడం మంచిది.

Google Maps లాంటి GPS నావిగేషన్ యాప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఎక్కువగా డేటా తీసుకుంటాయి. చాలా యాప్స్ ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. Wi-Fiకి కనెక్ట్ చేయబడినప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించడం ద్వారా డేటాను కాపాడుకోవచ్చు.

చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు డేటా-సేవింగ్ మోడ్‌ను అందిస్తాయి. ఇది డేటా వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

5G వేగంగా డేటా ఇస్తుంది. 4Gతో పోలిస్తే ఎక్కువ డేటా, బ్యాటరీని వినియోగిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ 5G, 4Gకి సపోర్టు చేస్తే, 4Gకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల డేటాను సేవ్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news