రాష్ట్రం అంతా వైసీపీకి అనుకూలంగా ఉంది… 175 కి 175 సాధ్యమే: సీఎం జగన్

-

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు మరియు రీజినల్ కో ఆర్డినేటర్ లు హాజర్యయారు. ఈ మీటింగ్ లో జగన్ మాట్లాడుతూ… నేతలు అందరికీ ఎన్నికల గురించి మరియు ఏ విధంగా గెలుపును దక్కించుకోవాలి అన్న పలు విషయాలను వారితో చర్చించడం జరిగింది. ఇక సమయం లేదు… మనము గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది , ఇప్పటి వరకు మనము చేసింది ఒక ఎత్తు అయితే ఇకపై చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎన్నికలకు చాలా కీలకం కానుంది అంటూ జగన్ వారికి వివరించారు. ఎన్నికలకు మనకు మిగిలి ఉన్న ఈ ఆరు నెలల సమయం అందరికీ చాలా కీలకం, ఇప్పుడు మనము ఎలా పనిచేశామన్నదే మన ఫలితాన్ని చూపిస్తుంది అంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.

రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను చూస్తే, అంతా వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి.. మనము అనుకున్న టార్గెట్ 175 కి 175 సాధ్యమే అంటూ నేతలలో విజయ కాంక్షను రగిలించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news