హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకోవాలి అనుకుంటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

-

జుట్టు అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది. హెయిర్‌ స్టైల్‌ మారితే.. మన లుక్కే మారిపోతుంది. కానీ ఈరోజుల్లో చాలమందికి.. ముఖ్యంగా అబ్బాయిలకు బట్టతల త్వరగా వస్తుంది. దీనికోసం ఏవేవో ట్రీట్‌మెంట్స్‌ చేయించుకుంటారు. మందులు వాడతారు. ఇక ఫైనల్‌గా వీటివల్ల లాభం లేదనకున్నప్పుడు.. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకుంటారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తర్వాత చాలా మంది జుట్టపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. దీని కారణంగా ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకోవాలి అనుకునేవాళ్లు.. ఈ విషయాలు ముందే తెలుసుకోవాలి.

ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉందా?:

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకునేవారు ఇన్ఫెక్షన్స్‌ సోకుతుందని వెనకడుగు వెస్తున్నారు. అయితే ఇన్ఫెక్షన్స్‌ రాకుండా ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత చాలా రకాల ఔషధాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

దురద సమస్య:

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత దురద సమస్యలు రావడం చాలా కామన్‌.. సరైన సమయంలో ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందలేక పోతే తీవ్ర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల కొంత వరకు అదుపులో ఉంటుంది.

సాధారణ జుట్టులాగా కనిపిస్తుంది:

చాలా మందిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు సాధారణ జుట్టులాగే కనిపిస్తుంది. కాబట్టి ఆ జుట్టు పెరుగుతున్న కొద్దీ అలాగే ట్రీట్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్రీట్మెంట్‌ తర్వాత జుట్టును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.

శాశ్వత జుట్టు రాలకుండా ఉండడానికి..

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు రాలకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ జుట్టును చిన్న కట్‌ చేసి ఉంచుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది.

ఈ జాగ్రత్త తప్పనిసరి:

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తర్వాత సుమారు 4-5 రోజుల పాటు సూర్యరశ్మి జుట్టుపై పడకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యులు సూచించిన మందులను కూడా క్రమం తప్పకుండా వాడాలి.

Read more RELATED
Recommended to you

Latest news