మణిపూర్‌ అల్లర్లు.. కదం తొక్కిన విద్యార్థులు

-

కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వారి మ‌ృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నెట్టింట వైరలైన ఈ ఫోటోలను చూస్తే గుండె బరువెక్కిపోతుంది. దీంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో.. రాజధాని ఇంపాల్‌ లో మంగళవారం వందలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు విద్యార్థులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. మణిపూర్‌లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై ఆగ్రహించిన రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులంతా ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ నివాసం వైపు కవాతు చేసేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు విద్యార్థులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news