చంద్రబాబు సుప్రీం కోర్ట్ విచారణ, తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ …!

-

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సిఐడి సరిగ్గా చంద్రబాబును అన్ని విధాలుగా బ్లాక్ చేసింది.. తద్వారా అసలు బెయిలు కూడా రాకుండా టీడీపీ నేతలు, లోకేష్ లు అష్టకష్టాలు పడుతున్నారు. FIR ను కొట్టి వేయాలంటూ ఏపీ హై కోర్ట్ లో వేసిన పిటిషన్ ను కొట్టి వేయగా, చంద్రబాబు తరపున లాయర్లు సుప్రీం కోర్టు లో పిటిషన్ ను వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై రేపు సుప్రీం కోర్టు లో విచారణ జరగనుంది.. ఈ కేసును విచారించనున్న బెంచ్ ను కూడా ఫైనల్ చేశారు. చంద్రబాబు కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ ఎస్వీ భట్టి ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ రేపు జరగనుంది.

Chandrababu-Arrest

ఇక ఈ కేసు విచారణ ఎలా జరుగుతుంది మరియు సుప్రీం కోర్టు ఏమని తీర్పు ఇస్తుంది అన్న విషయం గురించి దేశప్రజలు అంతా వేచి చూస్తున్నారు. మరి రేపు ఏమి జరగనుంది అనేది తెలియలంటే విచారణ పూర్తి అయ్యే వరకు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Latest news