ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లితో మెగాస్టార్ రొమాన్స్‌..!

-

తెలుగులో ఢీ, రెడీ, బొమ్మరిల్లు లాంటి సినిమాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా బొమ్మ‌రిల్లు సినిమాలో హాసిని క్యారెక్ట‌ర్‌తో బాగా పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు ఆ పేరుతోనే చాలా మంది తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయింది. మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ త‌న‌యుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిలలలకు తల్లయింది.

అయితే కెరీర్ కాస్త స్లోగా ఉన్నప్పుడు పెళ్లిచేసుకున్న జెనీలియా… మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయ్యాక కూడా ప్రస్తుతం బాలీవుడ్ ఈవెంట్స్ కి తరచు వస్తూ ఆదిరిపోయే ఫిట్నెస్ తో…. అదరగొట్టే డ్రెస్సులతో నేను మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాని చెప్పకనే చేబుతోంది.

 

ఈ క్ర‌మంలోనే జెనీలియా మెగాస్టార్ చిరు – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కే సినిమా హీరోయిన్స్ లిస్టులో ఉన్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. ఈ సినిమా ఈ నెల‌లోనే మొద‌లు కానుంది. ముందుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రిగే షెడ్యూల్‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమా త‌ర్వాత శ్రీకాకుళం జిల్లాలోని ప‌లాస ఏరియాలో రెండో షెడ్యూల్ జ‌రుపుకోనుంది.

ఈ క్రేజీ ప్రాజెక్టులో మెయిన్ హీరోయిన్ గా త్రిష అని, సెకండ్ హీరోయిన్ లిస్ట్ లో ఈషా రెబ్బ పేరు వినబడినా… ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం చూస్తున్న జెనీలియా పేరు పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ తో జెనీలియా ఆరెంజ్ చిత్రం చేసింది. ఆ పరిచయంతోనే జెనీలియా కోసం రామ్ చరణ్ సంప్రదింపులకు దిగుతున్నట్టుగా టాక్.

Read more RELATED
Recommended to you

Latest news