రాత్రి పూట కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ వంటివి తాగరాదు. వాటి వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. నిద్ర చక్కగా పట్టాలంటే రాత్రి పూట టీ, కాఫీ సేవించరాదు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 6 నుంచి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇది నిజమే. నిద్ర తగినంత ఉంటే దాంతో అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అదే నిద్ర లేకపోతే అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించాల్సిందే. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ యుగంలో సగటు పౌరుడు నిత్యం ఎదుర్కొనే ఒత్తిళ్ల వల్ల మానసిక సమస్యలకు లోనవుతూ నిద్ర సరిగ్గా పోవడం లేదు. కానీ.. కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే రోజూ రాత్రి చక్కగా నిద్రించవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. నిద్రించే బెడ్‌రూంలో చాలా తక్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి. నీలం రంగు బెడ్‌లైట్ పెట్టుకుంటే మంచిది. నీలం రంగు కాంతి వల్ల మనం బాగా నిద్రిస్తామట. అలాగే నిద్రించే పరిసరాల్లో ఎలాంటి శబ్దాలు రాకుండా చూసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది.
2. కొందరికి చల్లగా ఉంటే నచ్చదు. కొందరికి వేడిగా ఉంటే నచ్చదు. ఇంకొందరు ఎలాంటి ఉష్ణోగ్రత ఉన్న గదిలోనైనా నిద్రిస్తారు. అయితే ఎవరికైనా సరిగ్గా నిద్ర పట్టాలంటే.. తమకు కావల్సిన ఉష్ణోగ్రత వద్ద గది ఉండేలా చూసుకోవాలి. అందుకు ఏసీలు, కూలర్లు వంటివి వాడవచ్చు. లేదా చలికాలం అయితే రూమ్ హీటర్లు వాడవచ్చు.
3. నిద్రించడానికి ముందు మద్యం సేవించరాదు. సేవిస్తే మన శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా నిద్ర పట్టకపోవచ్చు. కనుక మద్యం సేవించకపోవడమే బెటర్.
4. రాత్రి పూట మనకు పని ఏమీ ఉండదు కనుక అంతగా శక్తి అవసరం ఉండదు. కనుక భోజనం కూడా తక్కువగా చేయాలి. ఆహారం తక్కువగా తీసుకోవాలి. దీంతో చక్కగా నిద్ర పడుతుంది. అదే ఆహారం ఎక్కువగా తీసుకుంటే నిద్ర త్వరగా పట్టదు. దీంతో నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక ఆహారాన్ని మితంగానే తీసుకోవాలి.
5. మీరు నిద్రపోయే బెడ్ లేదా పరుపు, దిండ్లు మీ శరీరంపై ఒత్తిడి కలిగించకుండా చూసుకోవాలి. చాలా సౌకర్యవంతమైన బెడ్ అయితే నిద్ర చక్కగా పడుతుంది.
6. కొందరు పగటి పూట బాగా నిద్రిస్తుంటారు. అలా చేస్తే రాత్రి పూట నిద్ర పట్టదు. కనుక పగటి పూట నిద్రించకూడదు. లేదా చాలా తక్కువ సమయం పాటు నిద్రించాలి. దీంతో రాత్రి చక్కగా నిద్ర పడుతుంది.
7. రాత్రి పూట కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ వంటివి తాగరాదు. వాటి వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. నిద్ర చక్కగా పట్టాలంటే రాత్రి పూట టీ, కాఫీ సేవించరాదు.
8. పగటి పూట సూర్యకాంతి మన శరీరానికి బాగా తగిలితే రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఆ దిశగా యత్నిస్తే రాత్రి పూట చక్కగా నిద్రపోవచ్చు