బండారు సత్యనారాయణ అరెస్ట్ పై లోకేష్ స్పందన… !

-

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న రోజాపై అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి మరియు మాజీ టీడీపీ నేత బండారు సత్యనారాయణను ఈ రోజు సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బండారు సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే కనీసం ఏ స్త్రీ అయిన వినడానికి ఇష్టపడదు. కాగా తాజాగా ఈ ఆరెస్ట్ పై నారా లోకేష్ తనదైన శైలిలో ట్విటర్ ద్వారా స్పందించడం జరిగింది . లోకేష్ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ చేస్తూ, అప్పుడప్పుడు టీడీపీ నేతలు మాట్లాడే మాటలకే మీరు కేసులు పెట్టి అరెస్ట్ ల వరకూ వెళితే … రోజూ వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు మరియు మంత్రులు మాట్లాడే భూతులకు ఇంకెన్ని కేసులను పెట్టాలి అంటూ ప్రభుత్వంపై రెచ్చిపోయి కామెంట్ చేశారు.

ఈ రాష్ట్రంలో మీకు నచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, మీకు నచ్చని వాళ్ళు కొద్దిగా మాట్లాడినా వారిపై కేసులు పెట్టి అరెస్ట్ లు చేస్తారా ? మీకు ఒక చట్టం ? మాకు ఒక చట్టమా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news