పోటెత్తిన జనం.. కేపీహెచ్‌బీ లులూ మాల్‌లో స్టాల్స్ మొత్తం ఖాళీ

-

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవలే ప్రారంభమైన లులూ మాల్ కు కస్టమర్లు పోటెత్తుతున్నారు. ఈ మాల్ దెబ్బకు జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మెయిన్ రోడ్డు మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు ఇసుకవేస్తే రాలనంతగా వస్తున్న కస్టమర్లను చూసి మాల్ యాజమాన్యం సైతం విస్తుపోతోంది. బైక్ లు, కార్లు పెట్టడానికి కూడా పార్కింగ్ దొరకడం లేదు. మాల్ లోని స్టాల్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి. ఎక్కడ చూసినా చాకొలేట్ కవర్లు, ఫుడ్ కవర్లు, ఖాళీ కూల్ డ్రింక్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి.

ప్రఖ్యాత అంతర్జాతీయ ఫర్నిచర్ బ్రాండ్.. ఐకియా నగరంలో ఓ స్టోర్‌ను ప్రారంభించిందని తెలుసుకున్నప్పుడు జనాలు విపరీతంగా పోటెత్తారు. గచ్చిబౌలి వైపు వెళ్లే అన్ని రహదారులు వీకెండ్‌తో పాటు సాధారణ రోజుల్లోనూ కిటకిటలాడేవి. అలాగే దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచిన లులూ షాపింగ్ మాల్.. హైదరాబాద్‌కు వచ్చినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. వీకెండ్‌కు తోడు సోమవారం గాంధీ జయంతి కూడా కలిసి రావడంతో కూకట్‌పల్లిలోని లులూ మాల్‌కు వెళ్లే రహదారులపై విపరీతంగా ట్రాఫిక్ పెరిగింది. ఏది ఏమైనప్పటికీ సగటు పౌరుడు వారి కుటుంబాలకు సంతోషకరమైన క్షణాలను అందించేందుకు దృష్టి సారిస్తారు. ఐకియా, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అనుభవాలను దృష్టిలో వుంచుకుని లులూ మాల్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు ముందే చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పేవని నిపుణులు చెబుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news